20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వమే విత్తనాలు అందించాలి

20-07-2026 12:55 AM

అశ్వరావుపేట మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు

చండ్రుగొండ, జులై 19 (విజయక్రాంతి): ప్రస్తుతం వాతవరణంలో వచ్చిన మార్పులు, ఎల్నినొ ప్రభావం వల్ల వానలు కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇటవంటి తరుణంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తుందని, అటువంటి పంటల విత్తనాలను ప్రభుత్వమే ఉచింతంగా రైతులకు తక్షణమే అందించాలని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశాడు.

ఆదివారం చండ్రుగొండ లో ఆయన మాట్లాడుతూ సీతరామప్రాజెక్టు నీళ్లు అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తక్షణమే ఇవ్వాలని, గత ప్రభుత్వంలో పాత డిజైన్ ప్రకారం పంటకాలువలు తవ్వాలన్నారు. గొదావరి నీటి విషయంలో జిల్లా రైతులకు అన్యాయం చేసేలా ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జిల్లా రైతంగానికి ఈ ముగ్గరు మంత్రులే అన్యాయం చేస్తున్నారని విమర్సించారు. నీళ్ల విషయంలో రాజీపడేదిలేదని త్వరలో రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించాడు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ జిల్లా నాయకురాలు వగెల పూజ, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సంగొండి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.