11 July, 2026 | 1:45 AM

ఉద్యోగులకు పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి

11-07-2026 12:55 AM

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ 

కామారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ టిపిటిఎఫ్ రాష్ట అధ్యక్షులు కామారెడ్డి జిల్లా  కేంద్రంలో ఉపాధ్యా శిక్షణ లంచ్ అవరు లో సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఖండించారు. కొత్త కొత్త పేర్లతో  పాఠశాలలు ఏర్పాటు చేసి  ప్రస్తుతం ఉన్న పాఠశాలలను  రేషనలైజేషన్ పేరిట 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడం అనే అశాస్త్రియ  విధానానికి స్వస్తిపలకాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది సెకండరీ గ్రేడ్  ఉపాధ్యాయులు  తమ సర్వీస్ మొత్తంలో   ఏ ఒక్క పదోన్నతిని కూడా పొందకుండా  పదవీ విరమణ పొందుతున్నారన్నారు. ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును సృష్టించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. 317 బాధితులకు న్యాయం చేయాలని, బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు వెంటనే షెడ్యూలు విడుదల చేసి పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని,పి ఆర్సి ఇవ్వకుండా దాటవేస్తూ  మూడు సంవత్సరాల కాలం గడిచిందని ముఖ్యమంత్రి గారు  స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పి ఆర్ సి ని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శిక్షణ లో ఉన్న ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.