11 July, 2026 | 1:52 AM

కాంగ్రెస్ పటిష్టతకు ప్రతి కార్యకర్త కంకణబద్ధుడు కావాలి

11-07-2026 12:53 AM

పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్

ఘట్ కేసర్, జూలై 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడై ఉండాలని పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, కొర్రెముల రెవిన్యూ పరిధిలోని చెరుకు బాలయ్య గార్డెన్ లో శుక్రవారం పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రే రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను డివిజన్ లోని ప్రతి ఇంటికి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరవేసేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం బూతు స్థాయి నుండి కమిటీలను క్రియాశీలకం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలమని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిల నిలిచి ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సీనియర్ నాయకుడైన సస్పెండ్ చేయడం ఖాయమని హెచ్చరించారు. పార్టీకి కష్టపడి పని చేస్తే పదవులు వస్తాయని పైరవీలు చేస్తే రావని గుర్తు చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తన శాయశక్తుల కృషిచేసి గెలిపిస్తానని ప్రకటించారు.

ముఖ్యంగా పాఠశాలల సమస్యలను కూడా తీసుకొని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఓటు నమోదు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నా రాజకీయ జీవితంలో నాటి నుండి నేటి వరకు నా ఎదుగుదలకు సహకరించి కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనం తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు కర్రె జంగమ్మ, పాలడుగు అమరేందర్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిన్న నరసింహ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్, మెట్టు గణేష్ యాదవ్, బండ్లగూడ గౌడ్, బండ్లగూడ అనిల్ గౌడ్, ఉదారి వేణుగోపాల్, వినోద్, ఎర్ర మాధవి, కర్రె అశోక్,  ప్రభాకర్, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, నర్రి శ్రీశైలం, సహదేవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.