24 June, 2026 | 1:45 AM

ప్రభుత్వం వెంటనే విలీనం ప్రక్రియ ప్రారంభించాలి

24-06-2026 12:54 AM

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న 

కామారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం  ఉమ్మడి జిల్లా నిజామాబాదు, కామారెడ్డి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా మహాసభలు కామారెడ్డి, విద్యానగర్లోని రోటరీ క్లబ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా హాజరై ఆయన మాట్లాడారు. అంతకుముందు కామారెడ్డి ఆర్టీసీ డిపో నుండి  200 మంది, నిజామాబాదు 1, 2, ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ,  కామారెడ్డి డిపో కార్మికులు ఎర్రజండాలు చేతబట్టి యూనియన్ నినాదాలు ఇస్తూ ర్యాలీగా రోటరీ క్లబ్ కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముందుగా, ఈ మధ్యలో అమరులైన కామ్రేడ్ అహ్మద్, కామ్రేడ్ వీ. ఏల్ నర్సింహా రెడ్డి, చిత్రపటాలకు పూలమాల వేసి డయస్ పై అమరులకు నివాళులు, మౌనం పాటించి సభను ప్రారంభించారు.

ఈ సభకు ముఖ్య విశిష్ట అతిధి కామ్రేడ్ పద్మాకర్ మాట్లాడుతు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మొదటినుండి కార్మికుల హక్కులకై నిలబడి, ఐక్య పోరాటాలను నడిపించి కార్మికహక్కులను సాధించింది. అందులో భాగంగానే మొన్న జరిగిన ఏప్రిల్ 22,23,24వరకు 3రోజుల సమ్మె చేసి విలీనం చేస్తమని ప్రభుత్వం ఒప్పుకొన్నది. ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ గా వున్నపుడే ఆర్టీసీ నీ విలీనం చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ కోరిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురువెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు రావలసిన పే స్కేల్ 2021 సాధించడంలో జేఏసీ గా ఏర్పడి సమ్మె పోరాటం చేసి 11%prc సాధించాం.

జులై నెలలో పొందుతున్నము. చనిపోయిన పిల్లల ఉద్యోగాలు పర్మినెంట్ గా త్వరలో బోర్డు మీటింగ్ లో తీర్మానం చేసి వారిని రిక్రూట్మెంట్ ఐనా నుండే పర్మినెంట్ గా చేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు గారు, వెంకటి గౌడ్, ప్రసాద్ రెడ్డి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకులు విడి దాస్, సంజీవ్ మాట్లాడారు. ఈ సభకు ఉమ్మడి నిజామాబాదు అన్ని డిపోల నుండి రమేష్, రాజు, లింగమ్, చందర్, మల్లయ్య, నాగరాజు, లింబాద్రి, బాలరాజు, డిపో కమిటీ, కార్మికులు హాజరయ్యారు. కార్మికులు  హాజ రై మహాసభలను విజయవంతం చేశారు.