24 June, 2026 | 2:05 AM

ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపు

24-06-2026 12:54 AM

మొయినాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్నగర్ సర్వే నంబర్ 151లో పేదలకు మంజూరైన 60 గజాల ఇంటి స్థలాల ను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.

2007లో 290 మంది పే దలకు 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చా రు. అయితే సర్వే నంబర్ 14లో రహదారి హక్కుపై కోర్టు కేసు పడటంతో అప్పటి నుం చి లబ్ధిదారులు స్థలాలు దక్కక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి, శిలాఫల కాలు వేశారు తప్ప సమస్యను పరిష్కరించలేదు. 

పోరాటానికి సిద్ధం: 

తమ హక్కుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కట్టమీద శ్రీను, కరీమ్, కుమ్మరి విట్టల్, గోపాల్ నాయక్ హెచ్చరించారు. లబ్ధిదారులంతా ధర్నాను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు.