రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు
10-04-2026 12:00 AM
పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
బాన్సువాడ, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ పలు రైస్ డిపోలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సివిల్ సప్లై డిప్యూటీ అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు. పిడిఎస్ బియ్యాన్ని రైస్ డిపో యజమానులు ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ అశోక్ సిబ్బంది ఉన్నారు.




