మార్కెట్ విలువలను ప్రభుత్వం తగ్గించాలి
హుజూర్‌నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు
హుజూర్ నగర్, జూన్ 9: ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువలను తగ్గించాలని హుజూర్ నగర్ నియోజకవర్గ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు,ప్రధాన కార్యదర్శి వట్టికూటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డిఓ, మున్సిపల్, తహసిల్దార్ కార్యాలయ అధికారులకు ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువలను సవరించాలని వినతి పత్రం అందజేసి మాట్లాడారు... హుజూర్ నగర్ డివిజన్ లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలపై మార్కెట్ విలువలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వందకు వందశాతం పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదిలైన సమయంలో ప్రభుత్వం అత్యధిక రేట్లు పెంచడం తగదని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో పక్కాభవనాలు కోసం మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పెంచిన మార్కెట్ విలువలను సవరించి రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సురేందర్, శెట్టి శ్రీనివాస్, కృష్ణ, సత్యనారాయణ, ముక్కంటి సైదులు, నరసింహారావు, రవి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






