18-11-2025 12:28:07 AM
వరంగల్ (మహబూబాబాద్) నవంబర్ 17 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శ్రీజగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీ శ్వరులు, పరమహంస పరివ్రాజకులు జగద్గురు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయ స్నపన మండపంలో శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి భక్తులను ఉద్దేశ్శించి తమ అనుగ్రహ భాషణం తెలిపారు. పవిత్ర కార్తీక మాసం సోమవారం రోజున శ్రీ భద్రకాళీ సమేత భద్రేశ్వర స్వామి వారలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం, అభిషేకములు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భద్రకాళి శేషు, అర్ధకులు, వేదపండితులు, సిబ్బంది. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సాయంకాలం కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళలు దీపోత్సవం నిర్వహించారు.