ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మాజీ మంత్రి అల్లోల
కరీంనగర్, డిసెంబరు 7 (విజయక్రాం తి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన విజయ సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో రూ.21 లక్షల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు మహాలక్ష్మిపథకంలో భాగంగా లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లను, గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చింద న్నారు. త్వరలో పెంచిన పింఛన్లను, ఇందిర మ్మ ఇండ్లను సైతం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కుటిల బుద్ధితో, ఓర్వలేనితనంతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అస త్య ప్రచారానికి దిగుతున్నాయని ఆరోపించా రు. ఎన్ని అబద్ధాలు ప్రచారాలు చేసినా ప్రజ లు ఆ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నా రు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి బండి సంజయ్ ఒక్క రూపాయి తేలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశ్, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఎండి తాజ్ పాల్గొన్నారు.




