రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
08-12-2024 01:11 AM
మేడ్చల్, డిసెంబర్ 7: మేడ్చల్ మండల పరిధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. గుండ్ల పోచంపల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఓ బైక్ అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో కార్తీక్ రెడ్డి (23), అనిల్ (23) మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ దాబా వద్ద శుక్రవారం అర్థరాత్రి సుచిత్రకు చెందిన సామల రవితేజ బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




