18-07-2025 12:24:17 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,జూలై17(విజయక్రాంతి):గంగాధర మండలం కురిక్యాల శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల కార్యక్రమంలోబ్యాంకు లింకేజీ క్రింద 328 మహిళ సంఘాలకు రూ. 38.20 కోట్లు, 5273 ఇలా సంఘాలకు రూ. 6.92 కోట్లు, ఆరుగురు సభ్యులకు ప్రమాద బీమా క్రింద రూ.60 లక్షలు, 54 మంది సభ్యులకు లోన్ బీమా క్రింద రూ. 48.52 కోట్లు. స్టిచ్చింగ్ స్కూల్ యూనిఫామ్ కు రూ. 20.83 లక్షలు.
ఐదు మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు రూ ల్. 1.54 కోట్ల విలువైన చెక్కులను ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఐకెపి సెంటర్లు ఇలా ఏ అవకాశం ఇచ్చిన అద్భుతంగా చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారన్నారు.
పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాము. ఈ ఏడాది అర్హులైన కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరి చేశాము. రానున్న మూడున్నర ఏళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
కార్యక్రమంలో చొప్పదండి, గంగాధర , రామడుగు, బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తూరు మహేష్,జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, బొమ్మరవేణి తిరుమల తిరుపతి, బోయిని ఎల్లేష్, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తదితరులుపాల్గొన్నారు.