18-07-2025 12:24:26 AM
హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, జూలై 17(విజయక్రాంతి): ‘రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో నాపైన, ఇతరులపైన విషం చిమ్మడం ఇదే మొదటిసారి కాదు.. కేవలం సీఎం కార్యాలయానికి గౌరవమిచ్చి ఇప్పటివరకు సంయమనం పాటించా.. డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతోందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆధారం ఏమి టో చెప్పాలి. రేవంత్‌రెడ్డి చేసిన అసత్య, దురుద్దేశ పూర్వక నిందలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
సీఎం తాను చేసిన నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ హెచ్చరించారు. గురువారం ఢిల్లీ మీడియా చిట్‌చా ట్‌లో మాజీమంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశా రు.
తనపై డ్రగ్స్ కేసు ఏమైనా నమోదైందా? కనీసం అణువంత రుజువైన ఉన్నదా? అని అందులో కేటీఆర్ ప్రశ్నించారు. సీఎంకి దమ్ముంటే దొంగచాటుగా చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసురుతున్నానన్నారు. లేకుంటే తాను చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తనతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేదు కానీ ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరి తనపై బురద జల్లుతున్నారన్నారు.
చట్టం పరిధి నుంచి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే సీఎం చిట్‌చాట్‌ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పిరికి దదమ్మలా చిట్‌చాట్‌ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, వీటన్నింటినీ ఇక పై సహించేది లేదన్నారు.
తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబుకు ధారదత్తం..
‘గోదావరి, కృష్ణా మిగులు జలాల్లో తె లంగాణ వాటా ఎంత? కేంద్రమే తేల్చాలి.. దీనిపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి.. ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలు రేవంత్‌రెడ్డి అబ్బ సొత్తు, తాత సొత్తుకాదని, ఇష్టమొచ్చినట్లు సంతర్పణ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
‘ఎవరిని అడిగి కమిటీ వేశావ్? 30రోజుల్లో ఇచ్చే నివేదిక ఎ వరికీ ఫైనల్, అది నీకు కావచ్చు. తెలంగాణ రైతులకెట్లయితది.. నీకు అంత అభిమానం ఉంటే నీ ఇల్లు అమ్మి చంద్రబాబు విగ్రహం పెట్టుకో.. మేము వద్దంటలేం’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా చంద్రబాబుకు ధారదత్తం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రాలో ఉన్నది ప్రజలు, రైతులేనని, వారి కి తాము వ్యతిరేకం కాదని, ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. తెలంగాణ వాటా తేల్చా లని అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. మా వాటా తేల్చి, మా హక్కుల లెక్కచెప్పి, నీళ్లు కిందకు తీసుకెళ్తే మాకెలాంటి అభ్యంతరం లేదని ఉద్ఘాటించారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వానికి సూచిం చారు. ఢిల్లీలో జరిగింది ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని, ఇన్ఫార్మల్ మీటింగ్ అని సీఎం చెపుతున్న దాంట్లో నిజమెంత? దానికున్న చట్టబద్ధత, తీసుకునే నిర్ణయం, అమో దయోగ్యత ఏపాటిదో సీఎం ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.