15 June, 2026 | 2:56 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఫార్మా అనుమతుల రద్దుపై గ్రామపంచాయతీ తీర్మానం.. భిక్కనూర్ యువత హర్షం

19-01-2026 12:00 AM

భిక్కనూర్, జనవరి 18 (విజయ క్రాంతి): ఫార్మా కంపెనీకి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తూ బిక్నూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న తీర్మానంపై గ్రామ యువత హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్మానం గ్రామ భవిష్యత్తును కాపాడే చారిత్రాత్మకమైన, ప్రజాపక్ష నిర్ణయమని యువత అభివర్ణించింది. గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, రాబోయే తరాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మొత్తం గ్రామపంచాయతీ పాలకవర్గం ధైర్యంగా నిలవడం అభినందనీ యమని యువత పేర్కొంది.

ఈ సందర్భంగా బిక్నూర్ గ్రామ యువత మాట్లాడుతూ, ఈ తీర్మానం గ్రామ ఐక్యతకు నిదర్శనమని, ప్రజాస్వామ్యానికి గెలుపని, ప్రజల శక్తికి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. గ్రామ హితానికి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సరైన నిర్ణయంలో తమ మద్దతు ఎప్పుడూ పాలకవర్గానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీ రద్దు కోసం చేపట్టే ప్రతి పోరాటంలో ముందుండి పాల్గొంటామని, కాలుష్యరహితమైన బిక్నూర్ గ్రామం కోసం పోరాటం కొనసాగిస్తామని యువత ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం మా తొలి ప్రాధాన్యం, ఫార్మా ఫ్యాక్టరీలు వద్దు అంటూ నినాదాలు చేశారు.