సీతారాముల కల్యాణ మహోత్సవం
దుండిగల్ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో..
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): దుండిగల్ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ప్రసంగించారు. స్వామీజీ దివ్య నామ సంకీర్తనతో ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు ఆల్ ఇండి యా బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటుచేసిన పరాభవ నామ సంవత్సర గంటల పంచాంగం గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం స్వామి మాట్లాడుతూ.. బ్రాహ్మణులు ఐక్యత మరింత మెరు గుపరచాలన్నారు. బ్రాహ్మణ ఫెడరేషన్ సభ్యులను మైసూర్ లో గల తమ ఆశ్రమంకు రావాలని ఆహ్వానించారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు రాజు రవి ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ ఎప్పుడూ బ్రాహ్మణుల సేవా కార్యక్రమాలకు ముందే ఉంటుందని తెలిపారు.




