calender_icon.png 22 September, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటినుంచి సాయిబాబా ఆలయంలో..

21-09-2025 11:55:09 PM

శ్రీసాయి నామ శతకోటి మహా జపయజ్ఞం

ఎల్బీనగర్: దిల్ సుఖ్ నగర్ లోని శ్రీషిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న సోమవారం ఆలయంలో శ్రీ సాయి నామ శతకోటి మహా జప యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక కల్యాణం, భక్తుల సకల ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలు సిద్ధించడానికి శ్రీ సాయి నామ శతకోటి మహా జప యజ్ఞాన్ని ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు అందరూ ఈ మహాయజ్ఞంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సాయి నామాలు  ఓం శ్రీ సాయి రాం, శ్రీ సాయి నాథయ నమః ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జప నామాలను వయో, భాషా భేదం లేకుండా ప్రతి భక్తుడు నిష్ఠాతో చేయొచ్చని తెలిపారు. జప సంఖ్యని ప్రతిరోజూ   శ్రీ షిరిడి సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్ సుఖ్ నగర్ కు నేరుగా లేదా వాట్సప్ నెంబర్లు 8500966566, 8330966566, 9052966566  కౌంటింగ్  షీట్స్  సమాచారం అందించాలని సూచించారు. సోమవారం మహా యజ్ఞాన్ని స్వరూపానంద స్వామి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ శ్యామ్ కుమార్ యాదవ్, మాజీ చైర్మన్లు గుండా మల్లయ్య, ఊర నర్సింహ గుప్తా, సంస్థాన్ సభ్యులు పాల్గొన్నారు.