22-09-2025 12:00:00 AM
సంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలకు గ్రామాలు.. పట్టణాలు సిద్ధం.
గౌరమ్మను కొలువనున్న ఆడపడుచులు
ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని ప్రత్యేక పండుగ
అధికారయంత్రాంగం ఆద్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 21(విజయక్రాంతి)ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని వి దంగా కేవలం తెలంగాణ రాష్ట్రం లో మాత్ర మే జరుపుకునే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ పూలనే పూజించే పండుగకు రాజ న్న సిరిసిల్ల జిల్లా లో సర్వం సిద్ధమవుతోంది ఊరూరా పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు ఆ దివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాంప్రదాయ వేడుకలకు అధికార యం త్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటులు జరుగుతున్నాయి.
గౌరమ్మను కొలవనున్న ఆడపడు చులు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగకు వేళ అయింది. ఈ నెల 21 వ తేదీన భాద్రపద మాసం అమావాస్య నుంచి దుర్గాష్టమి వర కు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఈసారి ఉత్సవాలను ఘనంగా చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ బతుకమ్మనే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది.
తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దై వంగా కలకాలం నిలిచిపోయింది. ప్రతి గ్రా మం, ప్రతి పట్టణంలోని వాడవాడనా బతుకమ్మ పాటలతో హోరెత్తనున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా ఆడి పాడి గౌరమ్మను పూజించనున్నారు.
నేటి నుంచి దసరా వరకు వేడుకలకు వేదిక కానున్నాయి
బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఘనం గా ఏర్పాట్లు బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వ అధికార యంత్రం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల, వే ములవాడ పట్టణాలతో పాటు ఆయా గ్రా మాల్లో అధికారులు సిబ్బంది బతుకమ్మ ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నారు. సిరిసిల్ల మానేరు తీరంలోని బతుకమ్మ ఘాటు వద్ద ఉన్న నీటిని నింపుతున్నారు. అలాగే మొరం పోయించి చదును చేయించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద అలాగే ఇతర చోట్ల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో అధికారుల ఆధ్వ ర్యంలో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.