11 April, 2026 | 3:38 AM

విద్య హక్కు చట్టం కోసం మహా పోరాటం

11-04-2026 01:28 AM
  1. ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద టీఆర్పీ భారీ ధర్నా  
  2. తల్లిదండ్రులకు తీన్మార్ మల్లన్న పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి) : ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 2౬న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న ప్రకటించారు.విద్య హక్కు చట్టం అమలు కోసం ఈ పోరాటం నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనా లని పిలుపునిచ్చారు.

ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకుంటూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు కాకుండా కుట్రలు చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఈనెల 26న గన్ పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి హాజ రై పోరాటానికి సిద్ధం కావాలన్నారు.విద్య పేరుతో ప్రతి సంవత్సరం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ దాదాపు రూ.90 వేల కోట్ల దందా జరుగుతోందని, ఈ భారం కూలీలు, ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు వంటి పేద ప్రజలపై పడుతోందని ఆ యన పేర్కొన్నారు.

పేదల కష్టార్జిత సంపాదనను ప్రైవేట్ విద్యాసంస్థలు అక్రమంగా దోచుకుంటున్నాయని, ఇందులో ప్రభుత్వ పాత్ర కూడా ఉందని తీవ్రంగా విమర్శించా రు. విద్య అనేది వ్యాపారం కాదని, అది ప్రతి ఒక్కరికీ హక్కు అని స్పష్టం చేసిన మల్లన్న గారు, కార్పొరేట్ విద్యాసంస్థలు, వాటికి మద్దతుగా ఉన్న ప్రభుత్వ పెద్దలు తమ చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిం చారు. విద్యను వ్యాపారంగా మార్చడంలో రాజకీయ నాయకులే ప్రధాన కారణమని, అన్ని పార్టీల నాయకులకు ప్రైవేట్ పాఠశాలలు ఉండటమే ఈ దోపిడీకి మూలమని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలలను కావాలనే నిర్లక్ష్యం చేసి, ప్రైవేట్ విద్యను ప్రోత్స హిస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం ఫీజులు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం లో ఉన్న పెద్దలే ప్రైవేట్ పాఠశాలలను స్థా పించి ప్రజలను మోసం చేస్తున్నారని, విద్య ను పేదలకు అందనంత ఎత్తులో ఉంచారని విమర్శించారు.చివరగా, రైట్ టు ఎడ్యుకేషన్ సాధనతో పాటు ఫీజుల దోపిడీని అరికట్టేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో అన్ని వర్గాల తల్లిదండ్రులు పాల్గొని విజయవం తం చేయాలని మల్లన్న పిలుపునిచ్చారు. మ నమంతా కలిసిపోరాడితేనే విద్య హక్కును సాధించగలం అని ఆయన స్పష్టం చేశారు.