ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
03-06-2024 12:05 AM
మనం తినే తిండే మన ఆరోగ్యంపై ప్రభావం చూపి స్తుందని అందరికీ తెలిసిన విషయమే అయితే... ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో మనిషి ముఖ్య సమస్యల్లో రక్తపోటు ఒకటిగా ఉంటుంది. కొంత కాలంగా ఈ సమస్య కొంత మంది చిన్న పిల్లలలో కూడా కనబడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటైన దీనిని నియంత్రణలో పెట్టుకోవడం కష్టమేనని డాక్టర్లు అంటున్నారు. రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
- తరుచుగా వచ్చే తలనొప్పిని తేలిగ్గా తీసుకోకూడదు.. అది అధిక రక్తపోటుకు ముందస్తు హెచ్చరిక. ఈ తలనొప్పి తలకు రెండు వైపులా వస్తుంది.
- అధిక రక్తపోటు వల్ల కళ్లలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. దీంతో హైపర్టెన్సివ్ రెటినోపతి అనే సమస్య వస్తుంది. అప్పుడు దృష్టి మందగించడమో లేదా రెండేసి రూపాలు కనబడడమో జరుగుతుంది.
- అధిక రక్తపోటు కొందరికి ముక్కులోని రక్తనాళాలు దెబ్బతీయడం వల్ల రక్తం కారుతుంది.
- అధిక రక్తపోటు కారణంగా ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది.
- ఈ సమయంలో గుండె సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తీవ్రమైన అలసటకు దారి తీస్తుంది.
- ఈ సమస్య ఒక్కోసారి మూత్ర పిండాలను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా గుండె విపరీతంగా కొట్టుకుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి.






