04-02-2026 12:17:40 AM
నామినేషన్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్గీయుల హైడ్రామా
ఏడుగురికి బీఫాంలు అందజేత.... అందులో 5 చెల్లని బిఫామ్‌లు
గద్వాల, ఫిబ్రవరి 3 : గద్వాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత మద్య గత కొంతకాలంగా మున్సిపల్ టిక్కెట్లు మా కంటే మాకే వస్తాయని చెప్పుకోవడంతో ఆశావాహుల్లో ఆశలు రేకెత్తాయి. మంగళవా రం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ముఖ్య నాయకుల డ్రామాల మద్య సరిత వర్గీయులకు మొండి చేయి చూపెట్టారు అధిష్టానం ఇద్దరి నేతలతో మాట్లాడి ఓ వర్గానికి 25, మరో వర్గానికి 12 వార్డులు ఇస్తారం టూ వచ్చిన వార్తలు పుకార్లుగా కనిపిస్తోంది.
తీరా మున్సిపల్ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో 37వార్డులకు సంబందించిన భీఫాంలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బలపరిచిన అభ్యర్థులకు అందజేసి నట్లు సమాచారం అందడంతో మాజీ జెడ్పీచైర్ పర్సన్ సరిత వర్గీయుల ఆందోళన మొ దలైంది.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాదని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయులకు అందజేశారని నమ్మించి మోసం చేశారని సరిత వర్గీయులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన టిక్కెట్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీం తో మాజీ జెడ్పీ సరిత వర్గీయులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.
సరిత వర్గీయులకు మొండి చేయి.. ....
మొదట డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గ ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ ర్గానికి చెందిన 37మంది కాంగ్రెస్ అభ్యర్థులకు భీఫామ్ లు అందజేశారు. ఆ తర్వాత మాజీ జెడ్పీచైర్ పర్సన్ సరిత వర్గానికి 7 వా ర్డులకు సంబంధించిన అభ్యర్థులకు భీఫాం లు అందజేశారు. మంగళవారం ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి చెందిన 37 మంది అభ్యర్థులు తమ భీఫాంలు ఎన్నికల అధికారులకు సమర్పించారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రి యలో భాగంగా మంగళవారం ఉపసంహరణతో పాటు ఆయా పార్టీల భీఫామ్ లు సమర్పించేందకు మంగళవారం మద్యా హ్నం మూడు గంటలకు ఆఖరి రోజు కావడంతో గద్వాల మున్సిపాలిటి వద్ద నామినేష న్ దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు నాయకుల్లో గందరగోళం మొదలైంది. ఎన్నికల ని బంధనల ప్రకారం మొదట బీఫాంలు సమర్పించిన వారికే కాంగ్రెస్ పార్టీ గుర్తు కేటాయి స్తారని వినికిడి.
అంతే కాకుండా బీఫాంలతో పాటు సీ ఫాంలు తప్పనిసరిగా సమర్పించ డం కీలకం కావడంతో.. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గీయుల వార్డు అభ్యర్థులు స మర్పించిన బీఫాంలు చెల్లవని తేలడంతో సరిత వర్గీయుల ఆశలు అడియాసలు అ య్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీఫాంలు అందవని తెలిసిన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఏడుగురికి బీఫాంలు అందజేత.... అందులో 5 చెల్లని బిఫామ్ లు. .....
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గీయులకు 7 వార్డులకు సంబంధించి బీఫాంలు అందజేశారు. అప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల బలపరిచిన 37వార్డుల అభ్యర్థులకు భీఫాంలు అందజేయడంతో వారు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత సరిత బలపరిచిన అభ్యర్థుల్లో 8,10,11,12,14, 29,36 వార్డుల అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. వారి లో 11 వ వార్డు అభ్యర్థి తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తలేమంటూ.. నామినేషన్ ఉపసహరించుకున్నారు. మిగత వార్డు అభ్యర్థులు కూడా బీఫాంలు ఎన్నికల అధికారులకు స మర్పించారు.
ఇందులో 14వ వార్డు అభ్యర్థి శంకర్ తప్ప మిగతా 5మంది బీఫాంలు చెల్లవని తేలడంతో.. చెల్లని బీఫాంలు ఎందుకు అందజేశారని డీసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ డబుల్ బీఫాంలు ఎందుకు అందజేశారని, అవగాహన ఉండి చేశారా లేక అన్నీ తెలిసి చెల్లని బీఫాంలు అందజేసి మమ్మల్మి నమ్మించి మోసం చేశారా అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.