04-02-2026 12:18:15 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల కళాశాల దళిత విద్యార్థిని జి. వర్షిణి మృతికి బాద్యులైన ఆ కళాశాల లెక్చరర్స్ మధుర, శ్రీ లక్ష్మి, ప్రిన్సిపాల్ డి. నాగరమణిలను వెంట నే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం తెలంగాణ అధ్యక్షురాలు ఎం దశకుమారి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఫోరం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం లో ఆమె మాట్లాడారు.
వర్షిణి పట్ల కుల వివక్షతో జరిగిన వేధింపులు వల్లే వర్షిణి తీవ్ర మనోవేదనతో మృతి చెందిందని తెలిపారు. మృతి చెంది రెండు వారాలు పూర్తి అవుతు న్నా బాద్యులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్, కార్యదర్శి, ఆర్జేడీ అధికారులు పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. ఇది కుల వివక్షత అన్నారు. డిఐఈఓ వడ్డెన్న వర్షిణి మృ తికి బాద్యులతో కుమ్మక్కవడం ద్వారా అన్యాయం జరుగుతుందన్నారు.
నగర పోలీ స్ కమీషనర్, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన లలో బాద్యులకు సరైన శిక్షలు వేయకపోవడం తోనే రాష్ట్రంలో దళితుల పై దాడులు, కుల వేధింపులు, అధిక మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బా ద్యులపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసికోకపోతే ప్రజా ఆందోళన చెపడతామని హెచ్చరించారు.
మృతురాలు వర్షిణి కుటుంబానికి రూ. కోటి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్, అడ్వకేట్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రాజలింగం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్. రాయప్ప, రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ డాక్టర్ వీ ఎల్. రాజు హై కోర్టు అడ్వకేట్ స్ సామ్రాట్ నరేంద్ర. పి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.