15 April, 2026 | 11:05 AM

సర్పంచులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని పెంచాలి

28-12-2025 12:00 AM
  1. బీసీ రిజర్వేషన్స్ 42 శతం పెంచిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి

బీసీ సర్పంచ్ లను బెదిరిస్తే బీసీ వ్యతిరేకుల్లారా ఖబర్దార్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభు త్వం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 50 శాతానికి పైగా సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచి తమ సత్తా చాటారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. కామా రెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఇంకా 10 శాతం సీట్లు గెలుచుకునే వారని అన్నారు.

42శాతం రిజర్వేషన్ ప్రకటించకుం డా హడావుడిగా సర్పంచ్ ఎన్నిక నిర్వహించి ఇందులో కేవలం 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని దీంతో ప్రజలు తిరగ బడి బీసీలకు అత్యధికంగా పట్టం కట్టారన్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ జరిపిన బంద్ వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగిందని దాంతోటే ఎన్ని ఎన్నికల్లో సర్పంచులు గెలిచారన్నారు. అగ్రకులాల వారు వివిధ పార్టీల వారు బీసీ సర్పం చ్ లను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ అని ఆర్. కృష్ణ య్య హెచ్చరించారు.

బీసీ సర్పంచ్ లకు బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. 40 సంవత్సరాల క్రితం ఒక్క బీసీ సర్పంచి లేరని ఈరోజు 50 శాతం మంది బీసీలు గెలిచారంటే అది బీసీల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని కృష్ణ య్య హెచ్చరించారు. జడ్పిటిసి, ఎంపిటిసి  42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోర్టులో వీటికి సంబంధించి కోర్టులో కేసు బలంగా ఉందని బీసీల వైపే న్యాయం గెలుస్తుందని అన్నారు.

సర్పంచులకు ఇస్తున్న 6,500 నుంచి 20వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ మాట్లాడుతూ సర్పంచ్ లతో పాటు వార్డు మెంబర్లకు కూడా గౌరవితనం పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కర్తాల్ నియోజకవర్గానికి చెందిన కొప్పు వసంత, కొప్పు కృష్ణ, దుద్దు నాగరాజు, సిలివేరు మాధవులతో పాటు15 మంది బీసీ వార్డు సభ్యులను శాలువాలతో కృష్ణయ్య ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి. రాజేందర్, గవ్వల భరత్ కుమార్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.