28-12-2025 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 27 (విజయక్రాంతి): టాలీవుడ్ డ్రగ్స్ కేసుల ప్రకంపనలు ఇంకా పూర్తిగా చల్లారకముందే హైదరాబాద్ మహానగరంలో మరోసారి సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారం గుప్పుమంది. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, నటుడు అమన్ ప్రీత్ సింగ్ మరోసారి మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా చేర్చబడ్డారు.
మాసబ్ ట్యాంక్ కేంద్రం గా సాగుతున్న ఓ డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేయగా, ఆ తీగ లాగితే అమన్ ప్రీత్ సింగ్ డొంక కదిలింది. గతంలోనూ డ్రగ్స్ కేసులో అరెస్టయి, జైలుకు వెళ్లి వచ్చిన అమన్ ప్రీత్.. తన పంథా మార్చుకోలేదని తాజా ఘటనతో రుజువైంది.
వ్యాపారుల క్లయింట్ల జాబితాలో అమన్‌ప్రీత్ పేరు
హైదరాబాద్‌ని ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ నెల 17న పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మాసబ్ ట్యాంక్ పరిధిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఏకంగా 43 గ్రాము ల కొకైన్, ఎండీఎంఏ వంటి ఖరీదైన, ప్రమాదకరమైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చా యి. తమ క్లయింట్ల జాబితాను నిందితులు బయటపెట్టారు. ఇందులో నటుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అమన్ ప్రీత్ తమ వద్ద నుంచి తరచుగా కొకైన్, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారి ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఈగల్ టీమ్ అధికారు లకు అమన్ ప్రీత్ ప్రమేయంపై బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు.
గతేడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ భారీ డ్రగ్స్ ఆపరేషన్‌లో అమన్ ప్రీత్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లోనూ నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన.. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్నారు. అయితే, మళ్లీ పాత పరిచయాలు, పాత నెట్‌వర్క్ ద్వారా మత్తు కు బానిసైనట్లు తాజా దర్యాప్తులో తేలింది.
నెట్‌వర్క్‌లో పెద్ద ముఠానే..?
కేవలం అమన్ ప్రీత్ సింగ్ మాత్రమే కాకుండా ఈ నెట్‌వర్క్ వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టయిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సిం ఘ్విలు కేవలం పెడ్లర్లు మాత్రమేనని పోలీసులు గుర్తించారు. వీరికి మరో నలుగురు వ్యక్తులు బెంగళూరు లేదా గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిం ది. ఆ నలుగురు ప్రధాన సరఫరాదారుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
మాసబ్ ట్యాంక్ ఘటనలో తన పేరు బయటకు వచ్చిందని తెలియగానే అమన్ ప్రీత్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. అమన్ ప్రీత్ కోసం వెస్ట్ జోన్ పోలీసులతో పాటు, నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని ఆయ న నివాసంతో పాటు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వర లోనే ఆయన్ను అదుపులోకి తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.