calender_icon.png 22 January, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52.42 లక్షలు

22-01-2026 12:16:47 AM

పాపన్నపేట, జనవరి 21: దేశంలోనే రెం డో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ హుండీ లను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీమతి ఏ సులోచన సమక్షంలో బుధవారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. శ్రీ వెంకట అ న్నమాచార్య సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 61 రోజుల హుండీని లెక్కించగా రూ.52,42,905 ఆదా యం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఆల య కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.