calender_icon.png 22 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

22-01-2026 12:15:43 AM

నాగల్ గిద్ద, జనవరి 21: నాగల్ గిద్ద మండలంలోని స్థానిక ఎస్త్స్ర రామకృష్ణ అరైవ్ అలైవ్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ భద్రతా నియమాలు పాటించాలని ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డుపై అధిక వేగంతో, మద్యం సేవించి వాహనం నడపరాదని, అలాగే ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగల్ గిద్ద ఎస్త్స్ర రామకృష్ణ తెలిపారు.