వివాహిత ఆత్మహత్య
జవహర్ నగర్, జూలై 4 (విజయక్రాంతి): కు టుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ బాలాజీ నగర్ శాంతినగర్ కు చెందిన మజ్జురి రేఖ (21) భర్త సాయికిరణ్(ఎక్సైజ్ కానిస్టేబుల్) బాలాజీ నగర్ పరిధిలో ని శాంతినగర్లో నివాసముంటున్నారు. వీరికి ఏడాది వయ సు గల కుమారుడు ఉన్నారు.
ఈనెల ౩న ఇంట్లో ఎవరూ లేని సమయం లో సీలింగ్ ఫ్యాన్‌కు రేఖ చీరతో ఉరివేసుకొని ఆత్మహ త్య చేసుకుంది. అనంతరం ఇం టికి వచ్చిన అత్త గమనించేసరికే ఆమె మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకు న్న క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించి మృతురాలి తల్లికి సమాచారం అం దించారు. కాగా తన కూతురు మరణానికి అ ల్లుడు సాయికిరణ్, అత్త మామలే కారణమ ని జమున జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థి..
శేరిలింగంపల్లి , జూలై 4 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హాస్టల్లో బీటెక్ సెకండి యర్ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుద్ (20)గా గుర్తించారు. కొంత కాలం గా అనారోగ్యం కుటుంబ సమస్యలతో మా నసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. శనివారం తెల్లవారుజామున తాను ఉంటున్న హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య పా ల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో..
శేరిలింగంపల్లి, జూలై 4 (విజయక్రాంతి): కుటుంబ కలహాలు, మనస్థాపం కారణంగా వివాహిత 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అరుణ (37) తొమ్మిదేళ్ల క్రితం అ న్మోల్ కుమార్‌తో వివాహమైంది. వారి ఆరే ళ్ల కుమార్తె ఆటిజం సమస్యతో బాధపడుతోంది. కూతురు అనారోగ్యం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా యి. దీంతో శనివారం తెల్లవారుజామున అరుణ తన అపార్ట్మెంట్ నుంచి దూకే సి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు సం ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఉ స్మానియా ఆసుపత్రికి తరలించారు. మృ తురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






