2 September, 2026 | 10:13 AM

దాడిని ఖండించిన ఐఏఎస్‌ల సంఘం

14-11-2024 | 01:05am

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్‌ల సం ఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేర కు సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయ ల్, కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ దాడి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. విధుల పట్ల తమకు ఉన్న సంకల్పాన్ని ఇలాం టి దాడులు బలహీన పర్చలేవని స్పష్టంచేశారు.