ముత్యాలమ్మ గుడికి ‘స్థల’ దానం
60 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన తుళ్లూరి దంపతులు
విరాళం విలువ రూ. 6 లక్షలు.. దాతలకు ఘన సన్మానం
రఘనాథపాలెం /ఖమ్మం, మార్చి 29(విజయక్రాంతి): ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలోని ముత్యాలమ్మ దేవాలయ విస్తరణకు అదే డివిజన్ లో నివాసం ఉంటున్న తుళ్లూరి మాధవరావు - కోటేశ్వరి దంపతులు విరాళం అందించారు. ఆలయ అభివృద్ధి కోసం తమవంతుగా సుమారు రూ. 6 లక్షలు విలువ చేసే 60 గజాల తమ స్థలాన్ని ఆలయానికి విరాళంగా ఇస్తున్నట్లు స్థల పత్రాలను ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందచేసి తమ ఉదారతను చాటుకున్నారు.
తుళ్ళూరి దంపతులకు అభినందన
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగటి ఉపేందర్ మాట్లాడుతూ.. ఆలయ విస్తరణకు తమ వంతు సహాయంగా స్థలాన్ని దానం చేసిన మాధవరావు దంపతులను అభినందించారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలను గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దిని ప్రసాద్, ఆళ్ల రమేష్, గద్దల చిన్నప్ప, తుళ్లూరి కృష్ణయ్య, నాగటి శ్రీనివాసరావు, శీలం వీరబాబు, గిరిశాల రామారావు, పందుల తిరుపతిరావు, భూక్యా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.




