15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మేడారం హుండీ ఆదాయం 2.64 కోట్లు

09-02-2026 12:32 AM

ఆదివారం పెరిగిన భక్తుల రద్దీ

మేడారం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు హనుమకొండ నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. ఆదివారం 200 హుండీల లెక్కింపు నిర్వహించగా రూ.2.64 కోట్ల ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు. ఇప్పటివరకు 828 హుండీలకు గాను 675 హుండీలను లెక్కించారు.

ఇప్పటివరకు మొత్తంగా రూ.10.71 కోట్ల ఆదాయం లభించింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మేడారం తరలివచ్చారు. జంపన్న వాగులో స్నాన ఘట్టాల వద్ద షవర్లు తొలగించడంతో భక్తులు వాగులోని నీటిని తలపై చల్లుకొని గద్దెల ప్రాంగణానికి చేరి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా వాహనాల్లో తరలిరావడంతో మేడారం జాతర ప్రాంగణం భక్తుల రద్దీ వాహనాలతో కిక్కిరిసిపోయింది.