2 June, 2026 | 1:56 AM

రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం

02-06-2026 01:10 AM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ జాన్ 01: పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టిస్తోందని కో దాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం గుడిబండ, అనంతగిరి , చిలుకూరు మండలం, గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు. పే దల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించే వ రకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.

సర్పంచ్ మందుల నాగయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మటి వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఇర్ల నరసింహారెడ్డి, ఉప స ర్పంచ్ జయసింహారెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్ సంతోష్ కిరణ్, హౌసింగ్ ఏఈ కృష్ణమూర్తి, సీ ఎం శ్రీను, మాదాసి నాగరాజు, నర్సిరెడ్డి, వార్డు సభ్యుడు వంశి, కుక్కడపు సైదులు, సోమపంగు శ్రీను, గామయ్య, ఇస్సాకు  పాల్గొన్నారు.