21 July, 2026 | 11:09 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలి

21-07-2026 12:00 AM

బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్

ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ మహాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్ జీహెచ్‌ఎంసీ అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమీషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని రమేష్ రామ్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రమేష్ రామ్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ లో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ ఫారాల భర్తీకి నియమించాలని విజ్ఞప్తి చేశా రు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు గడువు సమీపిస్తుండడంతో మరింత వేగవంతం చేసేందుకు బీఎల్ వోలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

బస్తీ, కాలనీ లలో విస్తృతంగా ప్రచారం చేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రొయ్యూరు శేషసాయి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏఎన్ రఘునాథ్, నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎ. మ హేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.