19 March, 2026 | 2:35 AM

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

19-03-2026 12:50 AM

కాజీపేట, మార్చి 18 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా విద్యాబోధనలో సేవలందిస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగారావు డిమాండ్ చేశారు. ఎస్ ఎస్ ఏ విద్యా విభాగంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు సిబ్బంది

తమ దీర్ఘకాలంగా అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కాజీపేట మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివో కనకయ్య, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సుమలత, సి ఆర్ పి లు రాంప్రసాద్, రేణుక, అయ్యార్పి యశోద పాల్గొన్నారు.