17-07-2025 01:01:11 AM
బదిలీ కోసం 50 వేలు ఆమ్యామ్యా
పొడిగించిన పదవీకాలంలో ఈఎన్సీ కనకరత్నం అవినీతి బాగోతం.. అరెస్టు చేసిన ఏసీబీ
ఆఫీసు, నివాసంలో సోదాలు.. ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు
హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 16 (విజయక్రాంతి) : తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం మరో భారీ తిమింగలాన్ని వలపన్ని పట్టుకుంది. ఏకంగా రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్- (ఈఎన్సీ) వీరవల్లి కనకరత్నం 50 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ డిప్యూటీ ఇంజినీర్‌ను బదిలీ కోసం లంచం డిమాండ్ చేయగా, బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ ఈ ఆపరేషన్ చేపట్టింది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా పదవీకాలాన్ని పొడిగిస్తే, కనకరత్నం ఆ అవకాశా న్ని అవినీతికి వాడుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తాండూరులో పనిచేస్తున్న డీఈ, వికారాబాద్‌కు బదిలీ కోసం ఈఎన్‌సీ కనక రత్నంను ఆశ్రయించారు. అయితే, బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలంటే తనకు 50 వేల రూపాయల లంచం ఇవ్వాలని కనకరత్నం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని ఆ డీఈ, నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించారు.
దీంతో, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం కనకరత్నం లంచం తీసుకుంటుండగా వల ప న్ని పట్టుకున్నారు. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఆయనను అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.
నిజానికి కనకరత్నం ఈ ఏడాది మార్చి 31నే పదవీ విరమణ చేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఆయన లంచాలకు పాల్పడటం పంచాయతీరాజ్ శాఖలో కలకలం రేపింది.
అరెస్టు అనంతరం ఏసీబీ అధికారులు పంచాయతీరాజ్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని కేపీహెబీకాలనీలో ఉన్న కనకరత్నం నివాసంలోనూ ఏకకాలంలో సోదా లు నిర్వహించారు. ఈ సోదాల్లో ల భించిన ఆధారాలపై పూర్తి వివరాలతో ఆయనపై ఆదాయానికి మిం చిన ఆస్తుల కోణంలోనూ దర్యాప్తు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.