calender_icon.png 18 July, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లీడర్ల చేతిలో యూరియా

17-07-2025 01:02:14 AM

బీఆర్‌ఎస్ నేత డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 

బెజ్జూర్, జూలై 16(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా.. 50 బస్తాల యూరియ తీసుకురాలేకపోయారని, జెపి నడ్డాను కలిసినా లాభం లేదని బీఆ ర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో రైతు లకు యూరియ అందడంలేదని తెలిసి,రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు.

ఆఫీసులో యూరియా కోసం బారులు తీరిన రైతులను కలిశారు.వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు రైతులందరికీ సమానం గా యూరియ పంపిణీ చేయకుండా, పార్టీ కార్యకర్తలకు ఎలా పంపిణీ చేస్తున్నారన్నారు. యూరియా బస్తాలు దళారులకు ఎలా అందుతున్నాయని, ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియ బస్తా రూ.400, 500 చొప్పున అమ్ముతున్నారని, వారిపై విజిలెన్స్  దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ధర బస్తాకు రూ.265 అయితే,అధిక రేట్లకు ఎలా అమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల చేతికి యూరియ అప్పగించి, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నా రని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక అధికారులను నిలదీశారు.అధిక ధరలకు యూరియ అమ్ముతున్న దళారులపై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలన్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకని నిలదీశారు.కెసిఆర్ పాలనలో ఎన్నడూ రైతులు యూరియ కోసం అవస్థలు పడలేదని ఎప్పుడు ఇబ్బందులు పడలేదు అన్నారు.రైతు భరోసా,రైతు భీమా సకాలంలో సక్రమంగా అమలయ్యిందన్నారు. రైతులను  కెసిఆర్ కంటికి రెప్పలా చూసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు వచ్చాయన్నారు. బిజెపి పార్టీకి ఎమ్మెల్యే ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియా ఇప్పించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే హరీష్ బాబుకు రైతుల సమస్యల పట్ల సోయి లేదని విమర్శించారు. మం డలంలోని పాపన్నపేట్, తలాయి గ్రామాల సమీపంలో నీట మునిగిన పత్తి పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందిం చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పెంచికల్ పెట్ మండలం అగర్ గూడా కు చెందిన శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ కన్వీనర్ సారయ్య,ఖాజామియా,ఫసి, బాబు రైతులు తదితరులు పాల్గొన్నారు.