17-07-2025 12:59:50 AM
ఆదిలాబాద్, జూలై 16 ( విజయ క్రాంతి ) : ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సార్లు సైతం ఓటమి చవిచూసిన పట్టు వీడని విక్రమార్కుడిలా నాలుగో సారి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందిన తమ అభిమాన నేత పాయల్ శంకర్ పై తన స్వగ్రామమైన జైనథ్ మండలం అడా గ్రామస్తులు అభిమానాన్ని చాటుకున్నారు. తమ గ్రామానికి చెం దిన పాయల్ శంకర్ గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే గా గెలుపొందుతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని సామూహికంగా తలనీలాలను సమర్పిస్తామని గ్రామస్థులందరు ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు. దీంతో ఇటీవల ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలుపొంద డంతో ఆయనపై ఉన్న అభిమానం చటుకునేలా గ్రామస్తులు తిరుపతికి వెళ్లి శ్రీ వేంక టేశ్వర స్వామికి తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నారు.
బుధవా రం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిశారు. దీంతో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతర వారి కి అన్నదానం చేపట్టి వారందరితో ఎమ్మెల్యే కలిసి భోజనం చేశారు. తన రాజకీయ విజయంలో అడా గ్రామ ప్రజల పాత్ర ఎంతో కీలకమని,
సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించగా గ్రామస్తులు, నియోజ కవర్గ ప్రజల అండదండతో ఈ స్థాయికి ఎదగానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. రాజకీయాల్లోనే కాకుండా ఏ ఇతర సమస్యలోనైనా తమ గ్రామస్తులు ఎల్లవేళలా అండ గా నిలిచారని, ఇది తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. తన జీవితకాలం గ్రామస్తులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.