బీటీ రోడ్డుగా మారిన ఖమ్మంపల్లి రోడ్డు
విజయక్రాంతి ఎఫెక్ట్..
మునిపల్లి, ఏప్రిల్ 13: మండల కేంద్రమైన మునిపల్లి చౌరస్తా నుంచి ఖమ్మంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు ఎన్నో ఏళ్లుగా కంకర రోడ్డుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని విజయక్రాంతి వెలుగులోకి తేవడంతో ఆ కంకర రోడ్డే.. ఇప్పుడు బీటీ రోడ్డుగా మారింది. కంకర ఉన్న సమయంలో చిన్నచెల్మెడ, బోడపల్లి తదితర గ్రామాల ప్రజలు అల్లాపూర్ గ్రామం మీదుగా తక్కడపల్లి చౌరస్తా నుంచి వెళ్లాల్సి వచ్చేది.
కాని ఖమ్మంపల్లి రోడ్డు బీటీ రోడ్డుగా మారడంతో దూరభారం తగ్గడంతో పాటు ప్రయాణం సైతం సులభతరమైంది. రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేయించిన మంత్రి దామోదర రాజనర్సింహ్మకు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ గుజ్జరి ప్రభుదాస్, ఉప సర్పంచ్ తుడుం యాదమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కడపల్లి సంగమేశ్వర్, లింగంపల్లి మక్సుద్ పటేల్ తోపాటు ఆయా గ్రామాల ప్రయాణికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి దామోదర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




