17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తోట భిక్షం స్ఫూర్తితో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

13-05-2025 04:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్మిక నాయకులు స్వర్గీయ తోట భిక్షం స్ఫూర్తితో జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు(CITU) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. దివంగత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట భిక్షం 4వ వర్ధంతి సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద అరుణ పతాకాన్ని తోట శ్రీనివాస్ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. తోట భిక్షం క్రమశిక్షణ కలిగిన కార్మిక నాయకుడని, ఎన్ని కేసులు, నిర్బంధాలు ఎదురైనప్పటికీ అధిగమించి ప్రజల పక్షాన పని చేశారని కొనియాడారు. కష్టజీవులు శ్రమజీవుల పక్షాన కార్మిక వర్గ దృక్పథంతో పని చేసిన నాయకుడు తోట భిక్షం అని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, రావుల రాజు, హేమ నాయక్, తోట యాకయ్య, మల్లయ్య, కోటేశ్వరరావు, సుధాకర్ వెంకన్న పాల్గొన్నారు.