13-05-2025 04:48:55 PM
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఔదార్యం..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మణ్ రాజ్ అనారోగ్యానికి గురై బ్రెయిన్ సర్జరీ చేయాల్సి రావడంతో ప్రత్యేక చొరవ తీసుకొని ఆపరేషన్ కు అవసరమైన రెండు లక్షల రూపాయల ఎల్వోసీని ప్రభుత్వం నుండి మంజూరు చేయించారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ రాజ్ ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి, అతన్ని కోరుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను కోరారు. రెండు లక్షల రూపాయల ఎల్వోసీ పత్రాన్ని ఎంపీపీఏ ధనుంజయ్ బాధితుడి భార్య జ్యోతికి అందజేశారు.