19-12-2025 01:35:11 AM
ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు
ఎల్బీనగర్, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు డిమాండ్ చేశారు. ఎస్‌ఏ డాంగే భవన్ లో నాగోల్, కొత్తపేట డివిజన్ల పరిధిలోని మున్సిపల్ అండ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశాన్ని గురువారం అండాలు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో రత్నాకర్ రావు మాట్లాడుతూ... పని గంటలుపెంచడంతో నిరుద్యోగులు పెరిగిపోవడం తప్పా మరొకటి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా కార్మికులపై నాలుగు కోడ్ లను రుద్దుతుంద న్నారు.
కార్మిక సంఘాలు స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించిన అనేక కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడం ఫాసిజానికికి తార్కాణమన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పర్మెంటు అయ్యేంతవరకు రూ, 26వేల కనీస వేతనం చెల్లించాలని, ఫీల్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ , 35000 ఇవ్వాలని, పెరుగుతున్న అధిక ధరల అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అండ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, వర్కర్స్ యూనియన్ ఎల్బీనగర్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎం.మద్దలేటి, నాయకులు శ్రీరాములు, ఎల్లయ్య, భాగ్యమ్మ, భారతమ్మ, లక్ష్మి, అండాలు, వెంకటమ్మ, జయమ్మ పాల్గొన్నారు.