13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

28-03-2026 12:22 AM

జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్ కాంతారావు

హనుమకొండ టౌన్, మార్చి27 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ తోపాటు ధర్మసాగర్ లోని రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్ ను  కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్ కాంతారావు శుక్రవారం సందర్శించారు. దేవన్నపేట పంప్ హౌస్, ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ వివరాలను అధికారులు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి ఎల్ కాంతారావు  అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ అండ్ అర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ సింగ్, సిడబ్ల్యుసి డైరెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇఎన్సీ జనరల్ రమేష్ బాబు, చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఇరిగేషన్ ఎస్ ఈ రాం ప్రసాద్, ఈఈలు సీతారాం,మంగీలాల్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్,జిల్లా సాగునీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్, మెగా ప్రాజెక్టు మేనేజర్ తిరుపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.