calender_icon.png 22 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వులే నవ్వులు విత్ లవ్

22-01-2026 01:35:07 AM

అబిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన తాజాచిత్రం ‘విత్ లవ్’. మదన్ రచన దర్శకత్వం వహించిన ఈ సినిమాను జియోన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సౌందర్య రజనీకాంత్, మగేశ్‌రాజ్ పసిలియన్ నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ బుధశారం విడుదలైంది. టీజర్ చూస్తే.. ఇది పూర్తి హాస్యభరితమైన సన్నివేశాలతో సినిమా అని తెలుస్తోంది. ఏషియన్ సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం సమకూర్చగా, శ్రేయాస్ కృష్ణ డీవోపీగా, సురేశ్‌కుమార్ ఎడిటర్‌గా, రాజ్‌కమల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.