22-01-2026 01:33:39 AM
నవీన్‌చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణకుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘హనీ’. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందీ చిత్రం. తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఆద్యంతం భయపెట్టేలా ఉన్న టీజర్ ఒక మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇందులో నవీన్‌చంద్ర లుక్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది. దివి, రాజారవీంద్ర, జయన్ని, జయత్రి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ; సినిమాటోగ్రఫీ: నగేశ్ బన్నెల్; ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్.