22-01-2026 01:36:28 AM
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ డైరెక్టర్ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వంలో పాలుపంచుకున్న చిత్రం ‘నిలవే’. ఈ సినిమాకు పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలు. శ్రేయాసి సేన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేశ్ మారాపు, జీవన్‌కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుస్మిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో భావోద్వేగాలు మెప్పిస్తాయని, కొత్త ఆలోచనలతో ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొం దిందని టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ నాయక్; డీవోపీ: దిలీప్ కే కుమార్; సాహిత్యం: ఎంవీఎస్ భరద్వాజ్, కోటి; ఎడిటర్: సత్య జీ; ప్రొడక్ష్ డిజైన్: కే శివరామకృష్ణ, జియా ఘోష్; నూరా సయ్యద్.