09-11-2025 12:00:00 AM
జూకంటి జగన్నాథం :
తెలంగాణ చరిత్రను పరిశీలించి చూస్తే.. ఎప్పుడూ ఇక్కడి ప్రజల బతుకులు ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు’ అన్న చందంగానే ఉంటున్నాయి. సామాన్య, అసామాన్య ప్రజల త్యాగాలు వృధాగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముందుచూపుతో ఒక విషయాన్ని స్పష్టం గా చెప్పాదలచుకున్నాను. ఈ ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న తీ రుతో పాటు త్వరలో వెలువడనున్న ఫలితాలు, ప్రభావాల మీద తెలంగాణ రాష్ర్ట భవిష్యత్తు ముఖచిత్రం ఆధారపడి ఉం టుంది.
త్వరలో రెండు సంవత్సరాల ప్రజాపాలనను పూర్తి చేసుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు.. ప్రతిపక్ష హోదాలో బీఆర్‌ఎస్ పార్టీ మరోవైపు, భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు తమ తమ బలాలను, బలగాలను మోహరించి ఈ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
గెలుపు మాదంటే మాదే!
సహజంగానే అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీకి మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ఎంతో కొంత ఎక్కువ ప్రయోజనమే ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు కావాల్సిన పార్టీ నిధులు.. పది సంవత్సరా ల తమ పాలనలో ఏర్పడిన అనుచరగణం, ఆ నాయకులకు ఉన్న గళం, దీనికి తోడు సానుభూతి పవనాలు వీచి తమకు అనుకూల ఫలితం వస్తుందంటూ సొంత మీడియా, సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించుకుంటున్నది. గత 10 సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ కొత్త రాష్ర్ట సారధి నేతృత్వంలో ఎన్నికల్లో పాల్గొంటున్నది.
ఈ పార్టీ కేంద్ర, రాష్ర్ట స్థాయి నాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాలుపంచుకుంటున్నారు. హిందూ ఓటర్లు ప్రధానంగా తమ లక్ష్యంగా చేసుకొని ఉపన్యాసాలు ఇస్తు న్నారు. పైగా వీరికి సమీప తెలుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ కూటమిలో ప్రధాన పార్టీ గా ఉన్న జనసేనకు చెంది న పలువురు నాయకులు బాహాటంగానే బీజే పీకి త మ మద్దతు ప్రకటించి నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెరవెనుక పని చేసిన ఆయా పా ర్టీలు.. రేపో మాపో నేరుగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెలుపు తమదంటే తమదని అన్ని పార్టీ లు పైకి బీరాలు పోతున్నప్పటికీ.. ఓటరు నాడీ ఎవరివైపు ఉందన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఆయా పార్టీలు సర్వేల పేరుతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓటరు మహాశయులు మాత్రం తమ ఓటు ఎవరికి వేయాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
రెడ్ల చేతుల్లోనే పాలన
ఇక పోలింగ్‌కు నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో అన్ని పార్టీలు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారాలు ముమ్మరం చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గోదాలో పనిచేస్తున్నా రు. తెల్లారి లేస్తే మూడు ప్రధాన రాజకీ య పార్టీల కార్యకర్తలు, నాయకులు చేస్తు న్న హడావిడి ప్రచారంతో ప్రజల చెవులు చిల్లులు పడుతున్నాయి.
నాయకుల పాత, కొత్త మాటల మూటలు, వాగ్ధానాలు, హామీల వరదతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి తెలంగాణ భూత, వర్తమాన, భవిష్యత్ రాజకీయ వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకొని చర్చించుకోవలసిన అవసరం ఏర్పడింది. నిజాం పాలనలో జమీం దారుల, జాగీర్దారుల, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు పోరాడి.. బందీగా మారిన తెలంగాణకు విముక్తి కలిగించారు.
అప్పటివరకు మద్రాస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఆంధ్ర రాష్ర్టం, ఇండియన్ యూనియన్‌లో కలిసి నూతనంగా ఆవిర్భవించిన హైదరాబాద్ రాష్ట్రం కూడా అప్పటివరకు బ్రాహ్మణ వర్గాల నాయకత్వంలోనే ఉండేవి. కానీ తదుపరి ఏర్పడిన పరిణామాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా ఇరు ప్రాంతాల రెడ్డీలంతా ఐక్యమై నాయకత్వంలోకి వచ్చారు. 1952 మొదటి సా ర్వత్రిక ఎన్నికల మొదలు 1983 వరకు ఉ మ్మడి ఆంధ్రప్రదేకు ఎక్కువకాలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.
లోపాయికారి ఒప్పందం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తెలంగాణ రక్షణలను ఆయా ప్రభుత్వాలు కాల రాశాయి. అంతేగాక నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటం అనేక విడతలుగా కొనసాగింది. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు తర్వాత అప్పటి టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన కేసీఆర్ 2023 చివరి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
అనంతరం కేసీఆర్ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత కారణంగా 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాం గ్రెస్ అధికారాన్ని చేజెక్కించుకుంది. అప్పటికే ఓటుకు నోటు కేసులో హస్తమున్న టీడీపీ నాయకుడు తెలంగాణ నుంచి తన బిచాణను ఎత్తివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోయారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇదే కాలంలో జరిగిన అనేక రాజకీయ మార్పులు వల్ల జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి మూడో కూటమిగా ఏర్పడి 2023 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమికి నాయకత్వం వహించిన నాయకుడు అధికారంలోకి వచ్చారు. జాతీయస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీయేకు ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన కూటమి మద్దతు అనివార్యమైంది.
అధికార కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి నప్పటికీ, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తుల నే తమ అభ్యర్థులుగా నిలబెట్టారు. అం దులో భాగంగానే లోపాయికారి గా ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట కూటమిలో భాగమైన జనసేన బీజేపీకి మద్దతు తెల పడంతో పాటు ప్రచారంలో దిగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే 2028లో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడో కూటమి పేరున రెండు రాష్ట్రాల్లో చేసే రాజకీయ విన్యాసాలు చతురతలను తెలంగాణ మేధావులు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకైనా, తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకునే బీఆర్‌ఎస్ పార్టీల ఉనికికి ప్రమాదమే కాకుండా మరోసారి సమై క్యమనే భావనతో తెలంగాణకు మూడో కూటమి ముప్పు మాత్రం ముంచుకొస్తున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలారా! రాజకీయ పార్టీ నాయకులారా!! తస్మాత్ జాగ్రత్త.
- వ్యాసకర్త సెల్: 9441078095