28 April, 2026 | 2:23 AM

జిందాల్ పేరుతో భూముల దోపిడీ ఆపాలి

28-04-2026 12:41 AM

భూములు రైతులకు తిరిగివ్వాలి

ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు

బొడ్డవరలో భూ నిర్వాసితుల ఆందోళన ఉధృతి

అమరావతి, ఏప్రిల్ 27: జిందాల్ కంపెనీకి కేటాయించిన భూములను వెంటనే రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు తిరిగి అప్పగించాలని ఆలిండియా బహుజన స మాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు.

శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో భూ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు.‘మా భూములు మాకు వెంటనే ఇవ్వాలి.. తిరిగి ఇచ్చే వరకు పోరా టం ఆగదు. మేం కూలీలం కాదు.. రైతులం. రైతులను కూలీలుగా మార్చొద్దు’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ఆధిపత్య కులాలైన కమ్మ, రెడ్డి నాయకత్వాలు కలిసి సుమారు 1100 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో జిందాల్ యాజమాన్యం ప్రధాన బాధ్యులని పేర్కొన్నారు. రైతులకు ఉద్యోగాలు, కంపెనీ షేర్లు ఇస్తామ ని హామీ ఇచ్చి మోసం చేసిన జిందాల్ యా జమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. గతంలో భూములు సేకరించి ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోతే భూములను తిరిగి అప్పగించాలని, లేకపోతే ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.

ప్రజాభిప్రా య సేకరణ లేకుండా జారీ చేసిన జీవో-14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిందాల్ కోసం కేటాయించిన భూ ములను రద్దు చేసి, బహుజనులపై జరుగుతున్న భూదోపిడీని అరికట్టాలని అన్నారు. పోలీసులు ధర్నాలకు అనుమతి నిరాకరించడంతో, ఎమ్మెల్సీ రఘురాజు తన నివాసం లో భూ నిర్వాసితుల ధర్మ పోరాట సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధి తులు తమ సమస్యలను వివరించారు. రైతులకు ఉద్యోగాలు, షేర్లు ఇస్తామని హామీ ఇ చ్చి మోసం చేసిన జిందాల్ యాజమాన్యం పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని భూ నిర్వాసితులు డిమాం డ్ చేశారు.

ఆల్ ఇండియా బహుజన సమా జ్ పార్టీ నాయకుడులకే రాజా రావు మాట్లాడుతూ భూములు కోల్పోయిన కుటుంబా లకు ఉద్యోగాలు, కంపెనీ షేర్లు, సరైన పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బక్క పరంజ్యోతి మాట్లాడుతూ, ఈ ఉద్య మం అణచివేతకు గురైన వర్గాల ఆత్మగౌరవ పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాలంతా ఏకమైతేనే సామాజిక న్యా యం సాధ్యమవుతుంది అన్నారు. డాక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, తెల్ల చొక్కా లు వేసుకున్న వారంతా ప్రజాహితవాదులు కారని, ప్రజలను మోసం చేసే నాయకత్వా న్ని ప్రజలు గుర్తించాలి.

తమ హక్కుల కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేస్తామని, ప్రజాస్వా మ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు ర్యాలీ నిర్వహించి జిందాల్ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, అధికారులపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమం లో భూ నిర్వాసితులు, రైతు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.