మహా కుంభాభిషేకం నిర్వహిస్తాం
డాక్టర్ గజల్ శ్రీనివాస్, అధ్యక్షుడు, సేవ్ టెంపుల్స్ భారత్
శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న గజల్ శ్రీనివాస్
అమరావతి, ఏప్రిల్ 27: శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వా మివారిని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్,సేవ్ టెం పుల్స్ భారత్ అధ్యక్షుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు, ముమ్మారు గిన్నిస్ రికా ర్డు గ్రహీత మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, విశిష్టత, అభివృద్ధి అవసరాలపై ఆలయ అధికారులతో, అర్చకులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు.
డా. గజల్ శ్రీ నివాస్ మాట్లాడుతూ, అత్యంత ప్రాచీనమైన శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం కుంభాభిషేకం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాని కులు, పండితులు అందించిన సమాచారం ప్రకారం కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేవాలయానికి కుంభాభిషేకం జరగలేదని తెలిపారు.ప్రభుత్వం, పురావస్తు శాఖ అనుమతులు లభించిన వెంటనే సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.






