29-07-2025 12:45:11 AM
వీధిలైట్ల ఏర్పాటు హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ముత్తారం జులై 28 (విజయ క్రాంతి) మండలంలోని సీతంపేట గ్రామంలో కంపు కొడుతున్న సీతంపేట అనేవార్త (విజయ కాంతి) పత్రికలో ప్రచురితం కాగా వెంటనే స్పందించిన యంత్రాం గం సోమవారం సీతంపేట గ్రామానికి చేరుకొని హుటాహుటిన గ్రామంలో ఉన్న మూరికి కా లువను పూడిక తీశారు. అలాగే వీధిలైట్ల ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో మురికి కాలువలు పూడిక తీయకపోవడంతో గత నాలుగు రోజుల కురిసిన వర్షానికి నీరు చేరుకొని కంపుకొట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రా మంలోని సమస్యలు తెలుసుకుని వార్త ప్రచురించగా, వార్తకు స్పందించిన ఎంపీడీవో సురేష్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి మనోజ్ జెసిబి తో పుడికతీత పనులు చేపట్టారు. గ్రా మంలో పారిశుద్ధ్యం పేరుకుపోకుండా గ్రామములో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామంలోని సమస్యలు ప్రచురించిన విజయక్రాంతి పత్రిక కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.