29-07-2025 12:44:55 AM
తాడువాయి రైతుల ఆందోళన
కామారెడ్డి, జులై 28 (విజయక్రాంతి): మాకొద్దు తాహసిల్దార్ అంటూ రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో తాహసిల్దార్ భూ సమస్యకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిపై రైతులు గంటపాటు ఆందోళన నిర్వహించారు. 20 మంది రైతులకు ఇనాం భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంలో తాహాసిల్దార్ నిర్లక్ష్యం చేస్తున్నా రని రైతు లు ఆరోపించారు.
పోలీసులు జోక్యం చేసుకొని పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గత కొన్ని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తాహసిల్దార్ పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు. ఎమ్మార్వో మాకొద్దు అంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు వచ్చి సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.