చీకటి వెలుగుల మయం ‘ముదిరాజు’ల చరిత్ర

02-05-2024 12:15:00 AM

మన కులాలు

ముదిరాజ్ జాతి లేదా ముదిరాజ్ కులం ఈనాటిది కాదు. మహాభారత కాలంలోనే ముదిరాజ్‌ల ప్రాదుర్భావం జరిగిందనడానికి చారిత్రక సాక్ష్యాధారాలు వున్నాయి. ముదిరాజ్ వంశ మూలపురుషుడు యయాతి మహారాజు. మహాభారత కాలం (6,195 సంవత్సరాల క్రితం) నాటి చరిత్ర ఇది. చారిత్రక పురాణ పరిణామ క్రమం ఇది. 

రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తె దేవయానితో యయాతి మహారాజు వివా హం జరిగింది. దేవయానిని అత్త వారింటి కి పంపినపుడు పుట్టింటివారు సారెతోపాటు దైత్యరాజు కుమార్తె శర్మిష్ఠని చెలిక త్తెగా పంపారు. యాదవుడు, తుర్వాసుడు అనే పేరుగల ఇద్దరు కుమారులు జన్మించారు. దేవయాని చెలికత్తె శర్మిష్ఠ అద్భుత సౌందర్యానికి యయాతి ఆకర్షితుడై ఆమె ను గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. యయాతి, శర్మిష్ఠలకు ముగ్గురు పుత్రులు అను, ధృవు, పురువులు జన్మించారు. ఈ రహస్య వివాహ గురించి తెలిసిన శుక్రాచార్యుడు ఆగ్రహంతో యయాతి మహారాజు ను ‘వృద్దుడివై పొమ్మని’ శపిస్తాడు. 

భయ విహ్వలుడైన యయాతి శాపవిమోచనం చేయమని ప్రార్థిస్తాడు. యయా తి ‘కుమారుల్లో ఏ ఒక్కరైనా అతని వృద్ధా ప్యం స్వీకరిస్తే శాపవిమోచనం అవుతుందని’ శుక్రాచార్యుడు మార్గం చెబుతాడు. దేవయాని, శర్మిష్ఠ కుమారులలో ఏ ఒక్క రూ ముందుగా యయాతి కోరికను మన్నించరు. చివరకు తండ్రి శాప విమోచనానికి శర్మిష్ఠ మూడవ కుమారుడు పురు వు సిద్ధపడి తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించి శాపవిముక్తి చేస్తాడు. అనంతరం పురువు పట్టాభిషేకం జరుగుతుంది. 

వృద్దరూపం ధరించి రాజ్యపాలన పురు వు చేసినందున ‘ముదిరాజు’ అనగా ‘ముదసలి రాజు’ అనే పేరుతో చరితార్థుడయ్యా డు. తదనంతరం యయాతి సంతతి వారందరూ ముదిరాజులుగా లోక ప్రసిద్ధి చెందా రు. ముదిరాజ్ వంశస్తులందరూ కాలక్రమంలో భారతదేశమంతటా వ్యాపించి ముత్తరాసు, ముత్తరాజు, మున్నురాజు, మెట్రామన్, అండాలకులు, బంట్లు, నాయకులు, తెలుగోళ్ళు, కబీర్‌నగర్‌లు, పాతిగార్లు, వెనువార్లు, కోలీలు మహాదేవ్ కోలీలు, కబర్ గార్లు, ముత్తరాచ, ముత్తరాయన్ అనే వివి ధ పేర్లతో సాంఘిక వ్యవస్థలో జీవనం సాగిస్తున్నారు.పేర్లు ఎన్నైనా వీరందరూ ఒకే వంశానికి చెందినవారు. అందుకే, వీరంతా ముదిరాజ్ కులానికి చెందిన వారని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు. చరిత్ర తెలు సుకున్న ముది రాజ్ పెద్దలు తమ కులస్తులను సంఘటితం చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే వున్నారు. విజయనగర పాలకులైన సాళువ నర్సింహరాయలు, కృష్ణదేవ రాయలు ముదిరాజులేనని తెలుస్తున్నది. ఈ విషయాన్ని ‘ఆంధ్రుల చరిత్ర’ గ్రంథం రుజువు చేస్తున్నదని ముదిరాజ్  పితామహుడు స్వర్గీయ కోర్వి కృష్ణస్వామి రచించిన  ‘ముదిరాజ్ జాతి చరిత్ర’ అనే ఉర్దూ మూల గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్త మాల్యద’ లో వంశం గురించి వివరిస్తూ ‘తాను ముదిరాజు అయినట్లు’ తెలియజేశారు.

ముదిరాజ్ కులం నిర్ధారణ క్రమం

వారి పేర్లనుబట్టి నిర్ధారణ జరిగినట్లు చరిత్ర తెలియజేస్తున్నది. లిఖిత లేదా మౌఖిక వంశవృక్షాల ఆధారంగా కూడా వ్యక్తుల కుల నిర్ధారణ జరిగినట్లు రుజువు లు వున్నాయి. ముదిరాజ్ జాతికి చెందిన పెద్దల నిర్ధారణ ప్రకారం ‘ముది’ అంటే ‘ముసలి’, ‘రాజ్’ అంటే ‘రాజు’ కలిసి ‘ముదిరాజు’ అని అర్థం. ఈ దృష్టితో చూస్తే చరిత్రలో ‘ముదిమి’ లేదా ‘ముదిరాజు’ అనే పదం మహాభారత కాలంలో మాత్ర మే వుందని, పురువు మహారాజు ‘ముదసలి రాజు’గా కీర్తి పొందారని అందువల్ల తమ వంశం మహాభారత కాలం నాటిదని ముదిరాజ్ పెద్దలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

అయితే, ‘భారతదేశంలో జాతులు, కులములు’ అనే గ్రంధం రచించిన డాక్టర్ ఇ.ధ్రష్టన్, రసల్, ‘ముదిరాజ్’ అనే పదం ‘ముత్తరాజు’ అనే దానికి మారిన రూపమ ని నిర్వచించారు. ఇక, ‘నిజాం రాజ్యంలోని జాతులు, -కులములు’ అనే గ్రంధం రచించిన డాక్టర్ సయ్యద్ సిరాజుల్ హసన్ మాత్రం ‘ముదిరాజ్’ అంటే ‘కేవలం ముసలిరాజు’ అని పేర్కొన్నారు. అలాగే, ఈ చరి త్రకారులు యయాతి  ‘ముదిరాజ్’ల మూల పురుషు డు అని పేర్కొనడం వల్ల ముదిరాజ్ పెద్దల మాట నిజమని వెల్లడవుతున్నది.

భారతదేశంలో ముదిరాజ్‌లు

ముదిరాజ్‌లు ద్రావిడ సంతతి వారు, రాజవంశానికి చెందిన వారు కనుక సహజంగా వీరు సాహసులు. రాజ్యాలు, రాజు ల కాలంలో సైనికులుగా తమ శక్తిని నిరూపించుకున్నారు. బ్రిటిష్ కాలంలో ముది రాజ్‌లు సైన్యంలో చేరి భారత దేశమంత టా వ్యాపించారు. బ్రిటిష్ జనరల్ క్లెయివ్ సైన్యంలో, హైదరాబాద్ కంటింజెంట్‌లో రసల్ బ్రిగెట్, నిజాం సైన్యంలో, ముదిరా జ్ వీరులు అధిక సంఖ్యలో పని చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో ముదిరాజ్ లు వేరువేరు పేర్లతో నేడు పిలువబడుతున్నప్పటికి, వీరి ఆచార వ్యవహారాలు ఒక్క టే. భౌగోళికంగా ముదిరాజ్‌లు అన్ని రాష్ట్రాల్లో వున్నప్పటికీ వీరిమధ్య వైవాహిక సంబంధాలు కొనసాగుతున్నాయి. 

చెన్నై, ముంబై, పూనా, నాగపూర్, ఆహ్మద్‌గర్, అనంతపూర్, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్టణం, బళ్ళారిలలో ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో వుండడమేగాక తమ జాతి ఒకటేననే భావంతో సం బంధ బాంధవ్యాలను కలిగి వున్నారు. తెలంగాణాలోని హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామా బాద్ జిల్లాలలో దాదాపు 30 లక్షలమంది ముదిరాజ్‌లు వున్నారు. కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూలు, ఉత్తర ఆర్కాటు, రాజస్థాన్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా వీరు గణనీయమైన సంఖ్యలో వున్నారు. తెలంగాణలో మొత్తం గా వారు 34 లక్షల జనాభా ఉన్నట్లుగా సామాజిక సర్వేలద్వారా తెలుస్తున్నది.

ముదిరాజ్ జాతివారు విజయనగరరాజు కాలంలో సరిహద్దుల కాపలా భాధ్యతలు నిర్వర్తించి ‘పాలెగారులు’ అనే బిరుదును పొందారు. తెలంగాణలో వీరు చౌకీదారులుగా పనిచేశారు. దొర, నాయుడు వంటి బిరుదులు కూడా ముదిరాజ్‌లకు ఇచ్చారు. వీరు విశ్వాసపాత్రులు. వీరు ‘చాందీ ప్రాంతం లో శిల్పకళ వృత్తిగా జీవిస్తున్నారు’ అని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్.డి. రస్సేల్ తన గ్రంధంలో పేర్కొన్నారు. తమిళనాడులో ముదిరాజ్‌లు ‘అండాలకరన్’ ‘ముత్రాయన్’ అని పిలువబడుతున్నారు.

1901 జనాభా లెక్కల ప్రకారం అండాలక్ కరన్‌లు, ముత్తరాశి వారు ఒకే సంతతి వారి గా తెలుస్తున్నది. కొంతమంది ముదిరాజ్‌ల ను బ్రాహ్మణులవలె, పురోహితుల వలె పరిగణిస్తున్నారు. కర్మకాండలు, శ్రాద్ధ కర్మల పుడు వీరు యజ్ఞోపవితం ధరిస్తారు. ముత్రాయన్ వారిని పాలెగార్లు, చౌకీదారులు, సరిహద్దు రక్షకులు లేక కాపలాదారులుగా చారిత్రకారు డు థ్రష్టన్ తన గ్రంథంలో పేర్కొన్నాడు.

ముదిరాజ్ జాతివారిని ‘బంటు’ వారని కూడా వ్యవహరిస్తారు. అయితే, వీరు ప్రస్తు తం వ్యవసాయం, వ్యాపారం, కూలి తదితర వృత్తులను జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. పూర్వం వీరు పైన్యంలో భటులుగా వున్నందున ‘బంటు’ అనే వ్యవహార నామం స్థిరపడింది. కర్ణాటక ప్రాంతంలో ‘కడల్‌గిర్’లని మహారాష్ట్ర ప్రాంతంలో ‘కోలిమహదేవు’ లని, ఆంధ్రప్రాంతంలో ‘ముత్తురాజు’లు, ‘ముత్రాచు’లని పిలువబడుతున్నారు.

“ముదిరాజ్ జాతివారు విజయనగరం రాజుల కాలంలో సరిహద్దుల కాపలా భాధ్యతలు నిర్వర్తించి ‘పాలెగారుల’ బిరుదును పొం దారు. తెలంగాణలో వీరు చౌకీదారులుగా పనిచేశారు. దొర, నాయుడు వంటి బిరుదులు కూడా వీరికివ్వబడినాయి. వీరు చాందీ ప్రాంతంలో శిల్పకళ వృత్తిగా జీవిస్తున్నారు” అని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్.డి. రస్సేల్ తన గ్రంథంలో పేర్కొన్నారు. తమిళనాడులో ముదిరాజు ‘అంబాలకరన్’ ‘ముత్రాయన్’ అని పిలువ బడుతున్నారు.

వృత్తి-  పరిణామ వృత్తులు

ముదిరాజ్‌లు స్వతహాగా భూస్వాములు కారు. కొంతమంది మాత్రం వ్యవసాయం వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. పూర్వకాలంలో ముదిరాజులు సైనికులుగా పని చేసేవారు. కాలానుగుణంగా, మారిన పరిస్థితుల ప్రభావం వల్ల వ్యవసాయదారులుగా, చేపలు పట్టేవారుగా, వ్యవసాయ కూలీలుగా, గ్రామ కావలికారులుగా, అటవీ ఉత్పత్తులను (పండ్లు కూరగాయలు, ఆకుకూరలు తదితరాలు) సేకరించి అమ్మేవారిగా జీవనం సాగిస్తున్నారు. ముదిరాజ్‌లు మంచి వేటకారులు కూడా. 

సేకరణ: స్వర్గీయ కృష్ణసామి ముదిరాజ్ ఉర్దూలో రాసిన 

ముదిరాజ్ జాతి చరిత్రకు

ఇది తెలుగు అనువాదం.