17 April, 2026 | 7:16 AM

కన్నుల పండువగా మహాపడి పూజ

02-01-2026 12:48 AM

అయిజ, జనవరి 1:అయిజ పట్టణ కేంద్రంలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజల అనంతరం భక్తులు పుర వీధుల్లో అయ్యప్ప స్వామి శోభాయాత్రను నిర్వహించారు. ఈ శోభాయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపురం రాముడు టీ పీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి, జయన్న తదితరులు పాల్గొని స్వామి వారి పల్లకిని మోశారు.అయ్యప్ప నామ స్మరణతో కన్నుల పండువగా  యాత్ర సాగింది.అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు