31 July, 2026 | 4:17 AM

ప్రధాన ఆసుపత్రి సొగసు చూడతరమా...

03-09-2025 12:51 AM

చుంచుపల్లి, సెప్టెంబర్ 2, (విజయక్రాంతి ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళి తే, ఉన్న రోగం నయం కావడం దేవుడెరుగు, లేని రోగం రావటం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అసలే వర్షాకాలం, అందునా చిత్తడి చిత్తడి ప్రదేశం. ఆసుపత్రికి వెళ్లే రోగులు వాతావరణం చూసి భయాందోళన చెందుతున్నారు. ప్రధాన ఆసుపత్రి పరిసరాల ప్రాంతమంతా గుంటలు గుంటలుగా మారీ చెరువును తలపిస్తోంది.

వైద్యం కోసం వచ్చే రోగులు ఆ గుంటల్లోనే నడుచుకుంటూ ఆసుపత్రి లోపటికి వెళ్ళవలసిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు కాలుజారి పడుతున్నా రు. క్షీణించిన ఆరోగ్యానికి తోడు ఏదో ఒక కొత్త సమస్య గా మా రింది. ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఇలాంటి దుస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు జిల్లా ఆసుపత్రి ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు ఆసుపత్రి లోపల, వెలుపల పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రికి వచ్చే రోగులు డిమాండ్ చేస్తున్నారు.సిసి రోడ్లు గాని మెటల్ రోడ్లు గాని వేయించి రోగులని కాపాడగలరని ప్రజలు భావిస్తున్నారు.